Table of Contents
- On desire as a driving force – Kaamigaani Vaadu – కామియైన వాఁడు కవియగు రవియగు
- Qualities of a yogi – anaya meesu maapi analambu challarchi – యాశ విడిచె నేని యతడుదాయోగిరా
- Impermanence – అశాశ్వతములు – ప్రాణమెవరి సొమ్ము పారిపోక నిల్ప
- The divine dwelling – adavidiruga ledu aakasamuna ledu – ఒడలు శుద్ధి జేసి యెడయని జూడరా
- హృదయమందున్న యీశుని దెలియక
- నీరు కారమాయె (క్షారమాయె) , కారంబు నీరయే
- మాటలాడ వేరే, మనసు కొలది వేరే
On desire as a driving force – Kaamigaani Vaadu – కామియైన వాఁడు కవియగు రవియగు
ఆ. కామిగాని వాఁడు కవిగాఁడు రవిగాఁడు
కామిగాక మోక్ష కామిగాఁడు
కామియైన వాఁడు కవియగు రవియగు!
విశ్వదాభిరామ వినురవేమ!!kaamigaani vaadu kavigaadu ravigaadu
కామం అంటే కోరిక అని అర్థం. కానీ, సాధారణంగా కామం అంటే శృంగార పరమైన కోరిక అని వాడుతూ ఉంటారు. కామి అంటే కోరిక గలవాడు.
kaamigaaka moksha kaamigaadu
kaamiyaina vaadu kaviyagu raviyagu
vishwadaabhiraama vinuravema!
కోరిక లేనిదే ఎవరు ఏ పని చేయరు, ఏదో ఒక ప్రతిఫలం ఆశించే పనులు చేస్తారు. అది కవిత్వం చెప్పడమైనా, లేదా మోక్షాన్ని సాధించడం అయినా.
కామిగాని వాఁడు కవిగాఁడు రవిగాఁడు = కోరిక లేనివాడు కవి కాలేడు అంటే పాఠకులను మెప్పించే కవిత్వం రాయలేడు అని అర్థం. రవిగాలేడు అంటే సూర్యుడివలె ఇతరులకు వెలుగునిచ్చేవాడు, దారిచూపేవాడు కాలేడు అని అర్థం.
కామిగాక మోక్ష కామిగాఁడు = మోక్షాన్ని సాధించడం అనేది కూడా ఒక కొరికే కదా, కోరికలే లేకపోతె మోక్షాన్ని మాత్రం ఎందుకు కోరతారు? మోక్షాన్ని సాధించాలి అని గట్టి కోరిక పట్టుదల ఉంటేనే సాధించగలుగుతారు అని అర్థం.
కామియైన వాఁడు కవియగు రవియగు = కవిత్వం మీద పట్టు సాధించాలన్న, మోక్షాన్ని సాధించాలి అన్నా , మనిషికి కోరిక, సంకల్పం ఉంటేనే సాధిస్తారు.
Kama means desire. But, usually kama is used to mean sexual desire. Kami means one who has desire.
No one does anything without desire, they do things expecting some kind of reward. Be it reciting poetry, or achieving salvation.