వేమన పద్యాలు – Vemana Poems (Padyalu)

Spread the love

Qualities of a yogi – anaya meesu maapi analambu challarchi – యాశ విడిచె నేని యతడుదాయోగిరా

అనయ మీసు మాపి, అనలంబు చల్లార్చి,
గోచి బిగియఁగట్టి, కోపమడచి;
యాశ విడిచె నేని యతడుదాయోగిరా!
విశ్వదాభిరామ వినురవేమ!
!

anaya meesu maapi, analambu challarchi,
gochi bigiyagatti, kopamadachi;
yaasha vidiche neni yatadudaayogiraa!
vishwadabhirama vinuravema!!

అనయం అంటే అహంకారం / గర్వం. అహంకారాన్ని విడిచి, దేహతాపాన్ని చల్లార్చి అంటే శారీరక కోరికలను విడిచి, గోచి బిగియ గట్టి అంటే శృంగార పరమైన కోరికలను వదిలి, కోపాన్ని అణచి వేసిన వాడే యోగి అని వేమన చెపుతున్నాడు.

యోగి అంటే అష్టాంగ యోగాలలో ఆరి తేరి, యోగ సిద్ధిని సాధించి, శరీరాన్ని అష్టవంకరలు తిప్పి, కఠోర దీక్షలు చేయనక్కరలేదు. అహంకారాన్ని విడిచి, కోపం తగ్గించుకుని, భౌతిక శృంగార కోరికలను వదలిన ఎవరయినా ఒక యోగి అని వేమన ఉద్దేశ్యం.
అయినా అష్టాంగ యోగాల ఉద్దేశ్యం కూడా ఇవి సాధించడమే, మనసును నియంత్రణలోకి తీసుకురావడమే అష్టాంగ యోగ ప్రధాన లక్ష్యం. అదే లక్ష్యాన్ని సాధించినవారు ఎవరయినా యోగ సిద్ధిని సాదించనట్టే, వారిని యోగి అని అనడం సబబే.

Anayam means pride/arrogance. Vemana says that a yogi is one who has abandoned pride, cooled the heat of the body, that is, abandoned physical desires, abandoned sexual desires, and subdued anger.

 Save as Image
 Save as PDF
Scroll to Top