నీరు కారమాయె (క్షారమాయె) , కారంబు నీరయే
నీరు కారమాయె, కారంబు నీరాయె
కారమైన నీరు కారమాయె;
కారమందు నీరు కడు రమ్యమైయుండు!
విశ్వదాభిరామ వినురవేమ !!కొన్ని పుస్తకాలలో పైవిదంగా ప్రచురించబడింది, కానీ అది తప్పేమో అని నా ఉద్దేశ్యం.. టైపింగ్ లో “క్షారం” కి బదులుగా “కారం” అని పడినట్టుంది. దానికి అర్థం రాసినవాళ్లు అపార్థం చేసుకున్నట్టున్నారు. క్షారం అంటే ఉప్పు కారం అంటే మిరపకారం, రెండు భిన్నమైన పదార్థాలు వాటికి భిన్నమైన స్వభావాలు. రెంటిని సమంగా వాడితే పద్యానికి అర్థమే మారిపోతుంది. ఎందుకంటే ఉప్పు నీట కలిసి నీరుగా మారడం, నీటిలోంచి ఉప్పు తీయడం మనకు తెలిసిందే. కానీ నీరు మిరపకారం ఆలా ఉండవు కదా !
It is published as above in some books, but I think it is a mistake.. In the typing, it seems that instead of “alkali”, it is “karam”. It seems that those who wrote the meaning misunderstood it. Alkali means salt and karam means chili, two different substances with different properties. If both are used equally, the meaning of the poem will change. Because we know that salt turns into water when mixed with water, and salt is extracted from water. But water and chili are not like that, right?
ఈ చిన్న సవరణ తరువాత ఈ క్రింద రాసిన విదంగా ఉంటుంది పద్యం, అర్థవంతంగా ఉంటుంది , కానీ మీకు నచ్చినది మీరు వాడుకోండి:
After this minor edit, the poem will look like this, which makes sense, but feel free to use whatever you like:
నీరు క్షారమాయె, క్షారంబు నీరాయె,
క్షారమైన నీరు, క్షారమాయె;
క్షారమందు, నీరు కడు రమ్యమైయుండు!
విశ్వదాభిరామ వినురవేమ !!ఈ పద్యం ద్వారా వేమన చెప్పదలచుకున్నది ఏమిటంటే, మానవ స్వభావం నిరంతరం మారుతూ ఉంటుంది, కానీ చెడుకి పూర్తిగా లొంగిపోతే మంచిని కోల్పోతాం. అయితే, అత్యంత దుష్టులలో కూడా దాగిన మంచితనం అందంగా ఉంటుంది. ఇది మంచి, చెడుల మధ్య ఉన్న సంఘర్షణ, మానవ స్వభావంలోని మార్పులను తెలియజేస్తుంది.