వేమన పద్యాలు – Vemana Poems (Padyalu)

Spread the love

మాటలాడ వేరే, మనసు కొలది వేరే

మాటలాడ వేరే, మనసు కొలది వేరే,
యోడలు గుణము వేరే, యోజ వేరే,
యెట్లు గలుగు ముక్తి? యేలాగు తనలాగు?
విశ్వదాభిరామ వినురవేమ!!

Maatalada vere , manasu koladii vere,
yodalu vunamu vere, yoja vere,
yetlu galugu mukti? Yelagu tanalaagu?
viswadabhirama vinuravema!!

చెప్పేది నీతి సూత్రాలు, దూరేది దొమ్మరి గుడిసెలు అన్నట్లుగా, మాటలు మాత్రం మంచిగా, గొప్పగా పలికి మనసులో తప్పుడు ఆలోచన చేసే వారికి, అదేవిధంగా ఆలోచన మాత్రం మంచిగా ,గొప్పగా ఉండి ప్రవర్తన దానికి భిన్నంగా ఉండే వారికి మనశ్శాంతి, ముక్తి ఉండవని వేమన వివరణ. మన మాటలు, ఆలోచన, ఆచరణ అన్ని ఒకే దాటిలో సాగితే మనశ్శాంతి పొందవచ్చు అని ఉద్దేశ్యం.

When your speech doesn’t reflect what’s in your heart, when your actions differ froom thoughts, how do you find peace or liberation? Vemana intends to tell us that our actions should be aligned with our thoughts and reflect what’s in our heart, keeping your speech doesn’t clean your mind, keeping your thoughts high but actions low doesn’t give you peace. So, keep your heart, mind, thoughts and actions all clean and all inline to find peace.

 Save as Image
 Save as PDF
Scroll to Top